మున్సిపల్ పీఠమెవరిదో..? మేడ్చల్ జిల్లాలో జోరుగా క్యాంపు రాజకీయాలు

by Ajay Maddhiboyina |

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి.మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. తమ అభ్యర్థులు జేజారి పోకుండా చూసుకునేందుకు వారిని రసహ్య శిబిరాలకు తరలించారు. అభ్యర్థులు తమ ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ అధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

మున్సిపల్ పీఠమెవరిదో..? మేడ్చల్ జిల్లాలో జోరుగా క్యాంపు రాజకీయాలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. తమ అభ్యర్థులు జేజారి పోకుండా చూసుకునేందుకు వారిని రసహ్య శిబిరాలకు తరలించారు. అభ్యర్థులు తమ ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ అధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా అభ్యర్థి తోపాటు ఆమె భర్తను కూడా క్యాంపుకు తరలించారు. దీంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పురపాలికల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.హంగ్ ఏర్పడిన ఎల్లంపేట, ఆలియాబాద్ రెండు మున్సిపాలిటీల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ మెజారిటి రాకపోవడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో బేరసారాలు అడుతున్నట్లు తెలిసింది.

ఒక సీటు దూరంలో బీఆర్ఎస్..

ఎల్లంపేటలో 24 వార్డులుండగా, 12 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగితా 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, నాలుగు వార్డుల్లో బీజేపీ గెలుపొందింది.దీంతో ఛైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ కు ఒక సీటు అవసరం ఉంది.ఎల్లంపేటలో ఎక్స్ అఫీషియో ఓటర్ గా నమోదు చేసుకొని, తద్వారా ఎల్లంపేటలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముందుగా భావించారు. అయితే శనివారం ఎన్నికల సంఘం ఆ మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై ఉంటేనే ఎక్స్ అఫీషియో ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే ఆ ఓటు చెల్లదని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయినా మల్లారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటరు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే మల్లారెడ్డికి ఓటు హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ నియోజకవర్గం, న్యూ బోయిన్ పల్లి,జయనగర్ కాలనీలో ఉంది. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం ఎక్స్ అఫీషియో ఓటు చెల్లని పక్షంలో ..నాలుగు సీట్లు గెలుపొందిన బీజేపీ మద్దతు కూడగట్టేందుకు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ తో మల్లారెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.ఎల్లంపేట, ఆలియాబాద్ లలో మద్దతు ఇస్తే.. వైస్ ఛైర్మన్ పీఠాలను కమలం పార్టీకి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే వైస్ ఛైర్మన్ పదవులు అవసరం లేదని, ఏదో ఒక మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం కావాలని బీజేపీ పట్టుపడుతున్నట్లు తెలిసింది.దీంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఆలియాబాద్ లో రసవత్తరం..

ఆలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను కాంగ్రెస్ పార్టీ 8 వార్డులలో గెలుపొందింది. బీఆర్ఎస్ 7 వార్డులు, బీజేపీ 3 వార్డులలో విజయం సాధించాయి. అదేవిధంగా బీఎస్సీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలుపొందారు. దీంతో ఆలియాబాద్ లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలను దక్కించుకోవాలంటే 11 మంది అభ్యర్థులు కావాలి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఏలాగైనా ఆలియాబాద్ ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీఎస్పీ, ఇండిపెండెంట్ అభ్యర్థులతో బేరసారాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇంకో అభ్యర్థి కోసం ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ అభ్యర్థుల కుటుంబ సభ్యులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.

Next Story