అల్వాల్ లో నాకాబందీ..25 వాహనాలు స్వాధీనం

by velandi.Saikiran |

నేరాల నియంత్రణకే నాకాబందీ అని పెట్ బషీర్బాగ్ ఏసిపి బాల గంగిరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో

అల్వాల్ లో నాకాబందీ..25 వాహనాలు స్వాధీనం
X

దిశ, అల్వాల్: నేరాల నియంత్రణకే నాకాబందీ అని పెట్ బషీర్బాగ్ ఏసిపి బాల గంగిరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ డిసిపి జోన్, ఏసిపి పెట్ బషీరాబాద్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. అల్వాల్ పోలీస్ సిబ్బందిని నాలుగు బృందాలుగా విభజించిన ఏసిపి బాల గంగిరెడ్డి, గ్రీన్ ఫీల్డ్ కాలనీ, నాగిరెడ్డి కాలనీ, కానాజిగూడ పెట్రోల్ బంక్, వెంకటాపురం లక్ష్మీ కళ మందిరం వద్ద పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. మొత్తం 531 వాహనాలను తనిఖీలు చేసామని, 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి బాలగంగి రెడ్డి తెలిపారు. రూ. 38,526 ల చాలాన్లు క్లియర్ చేశామని, పాపిలాన్ తనిఖీలు 11 4 డిడి కేసులను చేసినట్లు ఏ సి పి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్ స్టేషన్, అధికారులు సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Next Story