- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్జీఆర్ఐ మెట్రో కింద బైక్ ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బరాంరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, ఉప్పల్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బరాంరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అంబర్‌పేటకు చెందిన సుబ్బరాంరెడ్డి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, రోడ్డు క్రాస్ చేస్తూ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో ఆర్15 బైక్ ఢీకొనడంతో తలకి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108సిబ్బంది గాయపడిన సుబ్బ రాంరెడ్డిని వెంటనే సికింద్రాబాడ్ అపోలో ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బరాంరెడ్డి గత 15 సంవత్సరాలుగా సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ క్యాంటీన్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని అంబర్‌పేటలోని తన ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇతనికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.






