- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాది సుంకర నరేష్‌పై బార్ కౌన్సిల్ వేటు..
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి బార్ కౌన్సిల్‌లో నమోదు చేయించుకున్నారనే ఆరోపణలపై న్యాయవాది సుంకర నరేష్‌ను బార్ కౌన్సిల్ నుండి తొలగించినట్లు తెలిసింది.

దిశ, కాప్రా ; నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి బార్ కౌన్సిల్‌లో నమోదు చేయించుకున్నారనే ఆరోపణలపై న్యాయవాది సుంకర నరేష్‌ను బార్ కౌన్సిల్ నుండి తొలగించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో కాపు సెటిలర్ల కోసం కేటాయించిన ఏడు ఎకరాల భూమి కాపులకు చెందకుండా అడ్డుకునే ప్రయత్నంలో హైకోర్టులో పిల్ వేసి వార్తల్లో నిలిచిన సుంకర నరేష్‌కు బార్ కౌన్సిల్ వేటు వేసింది.
సుంకర నరేష్ హైకోర్టు న్యాయవాదిగా చెప్పుకుంటూ అనేక అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారని, సొంత కులస్తులపైనే కాకుండా ఇతరులపైనా దౌర్జన్యాలకు ఒడిగట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్ర కాపుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలం కాపులకు దక్కకుండా చేసే ప్రయత్నంలో, కాప్రాకు చెందిన నలుగురు కాపు నాయకులపై తప్పుడు కేసులు బనాయించి దాదాపు రెండు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితులు తెలిపారు. ఈ కేసు విషయంలో ఏ ఒక్క కాపు సంఘం గానీ, కాపు నాయకుడు గానీ తమకు మద్దతు తెలపలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకుని, పలువురిని మోసం చేసి, దౌర్జన్యాలకు పాల్పడి లబ్ధి పొందిన సుంకర నరేష్ చేసిన మోసాలకు ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాపులకు లబ్ధి చేకూర్చే భూమిని అడ్డుకోవడమే కాకుండా, కాపు నాయకులపైనే కేసులు పెట్టిన వ్యక్తికి కాపు అంతర్జాతీయ, జాతీయ తెలుగు రాష్ట్రాల సంఘాలు ఎవరూ మద్దతు తెలపవద్దని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






