బాబోయ్..! బోడుప్పల్ పరిధిలో విజృంభిస్తున్న దోమలు

by Ramesh Naini |

జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ప్రజలు దోమల సమస్యతో బాధపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలంతా పండగను ఆనందంతో జరుపుకుంటుంటే.. స్థానికులు మాత్రం దోమల దాడులతో నరకయాతన అనుభవిస్తున్నారు.

బాబోయ్..! బోడుప్పల్  పరిధిలో విజృంభిస్తున్న దోమలు
X

దిశ, మేడిపల్లి : జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ప్రజలు దోమల సమస్యతో బాధపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలంతా పండగను ఆనందంతో జరుపుకుంటుంటే.. స్థానికులు మాత్రం దోమల దాడులతో నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా సర్కిల్ లో ప్రజలు దోమలతో అవస్థలు పడుతుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లో విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఫాగింగ్ ఎక్కడా..

దోమల సమస్యతో ప్రజలు సతమతం అవుతుంటే.. అసలు సర్కిల్ లో ఫాగింగ్ చేస్తున్నారా లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండు కార్పొరేషన్ లు ఒక్కటి అవ్వడం, అందరు అధికారులు అందుబాటులో ఉన్నా కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో దోమలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. వరుసగా పండుగ సెలవులు రావడంతో కొందరు అధికారుల అలసత్వం వల్ల ప్రజల దోమల దాడిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత బోడుప్పల్ సర్కిల్ డీసీ, అధికారులు స్పందించి, దోమల నివారణ పై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అత్యవసర చర్యలు చేపట్టాలి : ఎండీ జాకీర్ హుస్సేన్, సోషల్ వర్కర్

సాయంత్రం అయితే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. చిన్నపిల్లలతో బయటకు రావాలంటే జ్వరాల బారిన పడతామేమో అని భయం వేస్తుంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఫాగింగ్ చేయించి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు ప్రత్యేక, అత్యవసర చర్యలు చేపట్టాలి.

Next Story