సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి...ఖండించిన‌ కాంగ్రెస్

by velandi.Saikiran |

భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై

సుప్రీం చీఫ్ జస్టిస్ పై దాడి...ఖండించిన‌ కాంగ్రెస్
X

దిశ, నాచారం : భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పలువురు నాయకులు అభివర్ణించారు. భారత చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి ని నిరసిస్తూ నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్ద క్రాంతి కిషోర్ ఆధ్వర్యం లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. అనంత‌రం నాయకులు మాట్లాడుతూ... దేశానికి మూడవ స్థంభ‌మైన ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం దారుణమ‌న్నారు. దేశంలో రక్షణ కొరవడిందన్నారు. గవాయి పై కేవలం వ్యక్తి గత దాడి కాదని.. భారత రాజ్యాంగంపై దాడి అని మండిప‌డ్డారు. ఈ కార్యక్రమం లో డివిజన్ జనరల్ సెక్రటరీ మహేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి, నాయకులు బండారి రఘు,సంతోష్ రెడ్డి, బొల్లం నరేష్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గౌడెల్లి రాకేష్ ఎన్.ఎస్ యు.ఐ డివిజన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షాహిద్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, బాలరాజు, శంకర్ గౌడ్ ,చందన్ యాదవ్,రాము,రాజు, అభి, జానీ, దిలీప్,ప్రభాకర్, మల్లేష్, ప్రణీత్ పాల్గొన్నారు.

Next Story