- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం
by Chukka Sudharani |
ఏటీఎంలో చొరబడిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి చోరీకి ప్రయత్నించిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, పేట్ బషీరాబాద్ : ఏటీఎంలో చొరబడిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి చోరీకి ప్రయత్నించిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇద్దరు దొంగలు షాపూర్ నగర్‌లో ఉన్న ఎస్‌బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. తొలుత సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఏటీఎం ను తెరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందడంతో జీడిమెట్ల పోలీస్‌లను అలెర్ట్ చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసుల రాకను పసిగట్టిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. చోరి యత్నానికి పాల్పడింది బిహార్, యూ పీ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు సమాచారం.
Next Story






