దత్తత చట్టబద్దంగా తీసుకోవాలి : క‌లెక్ట‌ర్ మను చౌదరి

by Ratna Kumari |

దత్తత చట్టబద్దంగా తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు.

దత్తత చట్టబద్దంగా తీసుకోవాలి :  క‌లెక్ట‌ర్ మను చౌదరి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : దత్తత చట్టబద్దంగా తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ ‘అడాప్షన్ హెల్ప్ డెస్క్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య పోర్టల్ www.missionvastalya.wvd.gov.in ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని. అక్రమ దత్తతను తీసుకున్నపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం ప్రజా వాణి రోజు కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం. అవసరమైన పత్రాలతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాలను అందజేయాలని సూచించారు.


అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి అవగాహన పెంపొందించుకుని, పిల్లలను దత్తత తీసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ.. ఆసుపత్రి, నర్సింగ్ హోమ్స్ లలో పిల్లల దత్తత ప్రక్రియ తీసుకోవద్దన్నారు. పిల్లల దత్తత ప్రక్రియను ఇంటి నుంచి లేదా, ఆన్లైన్ సెంటర్స్ నుంచి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ రహీం మాట్లాడుతూ.. పిల్లల దత్తత స్పాన్సర్షిప్ గురించి జిల్లాలోని ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులు ఎవరైనా ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

Next Story