- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్ లకు బానిసై ఇంట్లోనే దొంగతనం
బెట్టింగ్ యాప్ లకు బానిసై ఓ క్యాబ్ డ్రైవర్ తన సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, తిరుమలగిరి : బెట్టింగ్ యాప్ లకు బానిసై ఓ క్యాబ్ డ్రైవర్ తన సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తిరుమలగిరి సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 27న సివిల్ కాంట్రాక్టర్ పి. వెంకటేశ్వర్లు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోని 15తులాల విలువైన బంగారు ఆభరణాలు, 1లక్ష 50వేల నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన తమ విచారణలో ఫిర్యాదు దారుడి కొడుకు అదే భవనంలో విడిగా నివసిస్తున్న క్యాబ్ డ్రైవర్ పి రాజు ఈ దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన అతను, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకుని బంగారం, నగదును దొంగిలించినట్లు తెలిపారు.
అతను ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో 12తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి12లక్షల5వేలు తీసుకున్నాడని, దొంగిలించిన నగదుతో పాటు ఆ డబ్బును ఒక బెట్టింగ్ యాప్(డాఫా)లో ఖర్చుపెట్టాడు. మిగిలిన 3తులాల బంగారాన్ని తన నివాసంలో ఉంచుకున్నాడని తమ విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. విచారణలో నిందితుడు తన నేరం ఒప్పుకోగా.. అతని వద్ద నుంచి 3తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుని కోర్టులో హాజరపరచగా.. న్యాయమూర్తి నిందితుడిని జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో నిందితుడు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు సీఐ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హజరు పరచడానికి కృషి చేసిన డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జి విజయ రాజు, డీఎస్ఐ కెన్ని ఫోర్డ్, క్రైమ్ సిబ్బంది డి వెంకట్, కిషోర్, జి భాను చందర్, బి శైలేష్ కుమార్, బి కరణ్‌లను మల్కాజిగిరి జోన్ అదనపు డీసీపీ కె రాంకుమార్, తిరుమలగిరి ఏసీపీ జి రమేష్ లను అభినందించారు.






