- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ నోటీసులు చెత్తబుట్టకేనా?
సెంబర్ 14 ఉదయమే ఫిర్యాదు చేశా రు. ఉదయం ఫిర్యాదు అందినా పోలీసులు స్పందించలేదు. ఆదివారం

మున్సిపల్ నోటీసులు చెత్తబుట్టకేనా?
-పోలీసుల ‘బైండోవర్’.. రౌడీలకు ‘రెడ్ కార్పెట్’?
దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రభుత్వం మారినా పే దోడి రాత మారదా? రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ, అక్రమాలను అడ్డుకోవాల్సి న మున్సిపల్ యంత్రాంగం.. రెండూ కు మ్మక్కైతే సామాన్యుడి బతుకు ఏమవాలి? జగద్గిరిగుట్ట, శంషుగూడ సర్వే నంబర్ 57, ఫోర్త్ ఎస్టేట్ కాలనీ లో జరిగిన ఘటన వ్యవస్థలోని డొల్లతనాన్ని నగ్నంగా బయటపెట్టింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న నానుడిని.. ఇక్కడ జేసీబీలు, కిరా యి గుండాలు అపహాస్యం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ నోటీసు కేవలం 'కంటితుడుపు' చర్యేనా?
అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో చెప్పడా నికి ఈ ఘటనే నిదర్శనం. శంషుగూడ సర్వే నం. 57, ఫోర్త్ ఎస్టేట్ కాలనీలో అనుమతులు లేకుండా ఇనుప స్తంభాలు, కట్ట డాలు నిర్మిస్తున్నారని గుర్తిస్తూ, జీహెచ్‌ఎం సీ డిప్యూటీ కమిషనర్ (సర్కిల్ 24) స్వ యంగా 6 డిసెంబర్, 2025న 'షోకాజ్ నోటీస్' జారీ చేశారు. సదరు వ్యక్తులను డి సెంబర్ 22, 2025న విచారణకు హాజరుకావాలని, అప్పటివరకు పనులు ఆపాలని ఆదేశించారు.
అమలు శూన్యం
నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారే త ప్ప, క్షేత్రస్థాయిలో పనులు ఆగాయో లేదో పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఫలితంగా, డిసెంబర్ 22న విచారణ జరగక ముందే.. డిసెంబర్ 14 అర్ధరాత్రి జేసీబీలతో విధ్వం సం సృష్టించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కబ్జాదారులు ఇంతలా బరితెగించారు.
బైండోవర్ అయితే జైలుకు పంపరెందుకు ?
పోలీసుల తీరు మరీ విస్మయకరంగా ఉం ది. దాడులకు పాల్పడుతున్న సుబ్బారావు, వెంకటేశ్వరరావు, వెంకట్ తదితరులపై ఇప్పటికే జగద్గిరిగుట్ట స్టేషన్‌లో రౌడీయి జం, ల్యాండ్ కబ్జా కేసులున్నాయి. వీరు పో లీసుల ఎదుట ‘బైండోవర్’ అయ్యారు.
ముందస్తు ఫిర్యాదు:
తమ ప్రాణాలకు ముప్పు ఉందని బాధితు లు డిసెంబర్ 14 ఉదయమే ఫిర్యాదు చేశా రు. ఉదయం ఫిర్యాదు అందినా పోలీసులు స్పందించలేదు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు జేసీబీలు, వందల మంది గుం డాలు కాలనీలోకి వస్తుంటే పెట్రోలింగ్ పోలీసులు ఏం చేస్తున్నారు ? బైండోవర్ అ యిన వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తక్షణమే అరెస్ట్ చేయాలన్న నిబం ధన ఎందుకు అమలు కావడం లేదు?
వీడియో సాక్ష్యాలు ఉన్నా చర్యలేవి ?
బాధితులు చిత్రీకరించిన వీడియోల్లో అర్ధ రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇళ్లను కూల్చటానికి కూల్చేస్తుంటే, అడ్డుకున్న వారిని కర్రలతో బెదిరిస్తుంటే.. పోలీసులు చోద్యం చూస్తున్నారా? ఏసీపీ వచ్చి వెళ్లిన తర్వాత కూడా నిందితులు దర్జాగా తిరుగుతున్నారంటే స్థానిక పోలీసుల అండదండలు ఎ వరికి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అధికారులను నిలదీస్తున్న ప్రశ్నలు..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ గారూ.. మీ అధికా రులు ఇచ్చిన నోటీసులకు విలువ లేనప్పు డు, ఆ నోటీసులు ఎందుకు? కోర్టు ఆదేశా లు, మున్సిపల్ చట్టాలు పేదవాడి గుడిసె కూల్చడానికేనా? పెద్దల అక్రమాలకు వర్తిం చవా ?
సైబరాబాద్ సీపీ గారికి..
బైండోవర్ అయిన రౌడీషీటర్లు మళ్లీ దాడు లు చేస్తే, బాధ్యులైన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరు? అర్ధరాత్రి జేసీబీలు నడుస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా ?
ప్రజాప్రతినిధులకు
ఓట్లు అడిగేటప్పుడు కనిపించే ప్రేమ, ఇళ్లు కూలుతుంటే ఎందుకు కనిపించదు ? ఇప్పటికైనా తక్షణమే సర్వే నం. 57లో అక్రమం గా వేసిన పెన్సింగ్, గేట్లను జీహెచ్‌ఎంసీ అ ధికారులు తొలగించాలి. జీహెచ్‌ఎంసీ ఆదేశాలను, పోలీస్ బైండోవర్లను ధిక్కరిం చి అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వారిని అ రెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి. లేదంటే, చట్టంపై సామాన్యుడికి నమ్మకం పోతుంది.ఓట్లు అడిగేటప్పుడు కనిపించే ప్రేమ, ఇళ్లు కూలుతుంటే ఎందుకు కనిపించదు ? ఇప్పటికైనా తక్షణమే సర్వే నం. 57లో అక్రమం గా వేసిన పెన్సింగ్, గేట్లను జీహెచ్‌ఎంసీ అ ధికారులు తొలగించాలి. జీహెచ్‌ఎంసీ ఆదేశాలను, పోలీస్ బైండోవర్లను ధిక్కరిం చి అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వారిని అ రెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి. లేదంటే, చట్టంపై సామాన్యుడికి నమ్మకం పోతుంది.






