బాచుపల్లి యువ స్విమ్మర్ కు అరుదైన అవకాశం

by velandi.Saikiran |

బాచుపల్లి యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతంకు దేశం తరపున ప్రతిభను చాటే అరుదైన అవకాశం లభించింది.

బాచుపల్లి యువ స్విమ్మర్ కు అరుదైన అవకాశం
X

దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లి యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతంకు దేశం తరపున ప్రతిభను చాటే అరుదైన అవకాశం లభించింది.హైదరాబాద్ లోని బాచుపల్లి హరితవనం కాలనీకీ చెందిన యువ ప్రతిభా వంతుడు సుహాస్ ప్రీతం చిన్న నాటి నుండే స్విమ్మింగ్ లో ఆరితేరాడు. బహ్రెయిన్ లోని మనమాలో అక్టోబర్ 27 నుండి 30 వరకూ జరగనున్న 3వ ఆసియా యాత్ గేమ్స్ 2025 (అండర్ 18) ను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడకు భారత దేశం తరపున ఆదేందుకు సుహాస్ ప్రీతంకు అవకాశం దక్కింది. సుహాస్ ప్రీతం బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్స్ లలో ఇప్పటికే ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

2022, 2024 లలో భువనేశ్వర్ లో జరిగిన 48 వ, 50 వ జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ లో కొత్త జాతీయ రికార్డును ప్రీతం నెలకొల్పాడు. జాతీయ స్థాయిలో లో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో రజతం, కాంస్యం పథకాలు సాధించిన సుహాస్ ప్రీతం తన అసాధారణ ప్రతిభతో అక్టోబర్ 27 నుండి 30 వరకూ జరిగే ఆసియా యూత్ గేమ్స్ లలో భారత దేశానికి ఎంతో పేరు తీసుకువస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఆసియా యూత్ గేమ్స్ కు ఎంపికైన సుహాస్ ప్రీతంను జియాన్ మిషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు శశికిరణ్,క్రిస్టియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సీసీడబ్ల్యూఏ జోషువా లు శుక్రవారం ఘనంగా సత్కరించారు.

Next Story