- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, కీసర : నాగారం పురపాలక సంఘం పరిధిలోని విజయదుర్గ రెస్టారెంట్, అరేబియన్ మండి, ఓహో హైదరాబాది హోటల్, హవిస హోటల్,రెడ్ బకెట్ బిర్యానీ, గోదావరి రెస్టారెంట్ హోటల్స్ ను శనివారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని 6 హోటళ్లకు రూ.95 వేలు పెనాల్టీ విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించినట్లయితే అలాంటి హోటల్స్ ను మూసివేస్తామని తెలిపారు. హోటల్ యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి, వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






