Medchal District: ఇక పట్టణ జిల్లాగా మేడ్చల్.. మున్సిపాలిటీలుగా గ్రామాలు!

by Kema Shiva Kumar |

మేడ్చల్ జిల్లా త్వరలోనే పూర్తిగా పట్టణ ప్రాంత జిల్లాగా మారనుంది.

Medchal District: ఇక పట్టణ జిల్లాగా మేడ్చల్.. మున్సిపాలిటీలుగా గ్రామాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా త్వరలోనే పూర్తిగా పట్టణ ప్రాంత జిల్లాగా మారనుంది. ఇప్పటికే అత్యధిక గ్రామాలతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా మిగిలిన కొద్దిపాటి గ్రామాలను కూడా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ ​మినహా మిగిలిన 32 జిల్లాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కూడుకున్న జిల్లాలు. హైదరాబాద్​పూర్తిగా పట్టణ ప్రాంత జిల్లా. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరిగేవి కానీ. రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణ, కొత్త మున్సిపాలిటిలు, కార్పొరేషన్​ల ఏర్పాటుతో పట్టణాలు పెరిగాయి. నగరాలు విస్తరించాయి. దీంతో మేడ్చల్ జిల్లా ఇకపై పట్టణ జిల్లాగా మారనుంది. దీంతో రాష్ట్రంలో రెండు పట్టణ ప్రాంత జిల్లాలు, 31 గ్రామీణ ప్రాంత జిల్లాలు ఉండనున్నాయి. ఈ ప్రభావంతో 31 జిల్లా పరిషత్​లు మాత్రమే ఉంటాయి.

మేడ్చల్​ జిల్లాలో ప్రస్తుతం 28 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ నగర పాలకసంస్థలు, మున్సిపాలిటీలుగా ఏర్పటయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వాటిలో మూడు చింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్‌లను మూడు మున్సిపాలిటిలుగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదినలు కలెక్టర్ ద్వారా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖకు చేరాయి. వీటిని మొత్తం 28 గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీలు, గ్రామీణ మండలాలు లేకుండా అయ్యాయి. వీటి కంటే ముందు జిల్లాలో గ్రామీణ మండలాలు మూడు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ ​చైర్మన్, వైస్​చైర్మన్​ఇద్దరు జడ్పీటీసీలు కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఒక్క జడ్పీటీసీ సభ్యుడు మాత్రమే మిగులుతాడు.

అదే సమయంలో జడ్పీలో వివిధ శాఖలపై సమీక్షించడానికి ఏడు రకాల కమిటీలు ఉంటాయి. వీటికి ఒక్కొ జడ్పీటీసీ సభ్యులు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుంది. ముగ్గురు జడ్పీటీసీ సభ్యుల కోసం జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవోలు, డీఎల్‌పీవో, ఎంపీవో, ఇతర సిబ్బంది, అధికారులు ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సి ఉంటుంది. ముగ్గురు జడ్పీటీసీల కోసం జడ్పీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నంటి నేపథ్యంలో జిల్లాను మొత్తం పట్టణ ప్రాంత జిల్లాగా మారిస్తే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేసి కొత్తగా మొత్తం పంచాయతీలతో మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

Next Story