- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: మేడారం ప్రసాదం మీ గడపకే..! టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు.. వివరాలివే..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, వారు కోరుకున్న చోటికే అమ్మవార్ల ప్రసాదాన్ని (బంగారం) చేర్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ములుగు జిల్లాలో జాతర వైభవంగా జరగనుంది. అయితే సమయాభావం, రద్దీ లేదా ఇతర కారణాల వల్ల జాతరకు వెళ్లలేకపోయే భక్తులు నిరాశ చెందకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ ఈ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మేడారం వెళ్లలేని భక్తులు కేవలం రూ. 299 చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ మొత్తానికి ప్రసాదం ప్యాకెట్‌తో పాటు అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) కూడిన కిట్‌ను టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది భక్తుల ఇంటివద్దకే సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఆసక్తి గల భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో నేరుగా ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440069, 040-23450033లో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. మేడారం వెళ్లలేకపోయిన భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కోరారు.






