- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medaram Jatara: అసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాకు వేళాయే..!
Medaram Jatara: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పున:దర్శనానికి సమయం ఆసన్నమైంది.

దిశ, వెబ్ డెస్క్: Medaram Jatara: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పున:దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుండగా..మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది.
ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4 రోజులు పాటు మినీ మేడారం జాతర జరగనుండగా..బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగే, మండ మెలిగె పండగను నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈనెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా..బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు గుడి మెలిగే పండగకు శ్రీకారం చుట్టారు.
మేడారంలోని సమ్మక్క ఆలయంలోని సిద్ధబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడిమెలిగే పండగను నిర్వహించారు. ఈ గుడిమెలిగే పండగలో భాగంగా అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని శుద్ధి చేశారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు డోలు వాయిద్యాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజ చేసి అనంతరం పూజామందిరాన్ని అలంకరించారు. ఈ మండమెలిగే, గుడిమెలిగె పండగతో వనదేవల మినీ జాతర ప్రారంభమైనట్లేనని పూజారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి మినీ జాతర ముగిసే వరకుప్రతిరోజూ ఇక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు రాత్రి వేళల్లో డోలీలతో కొలుపు నిర్వహిస్తారు.
కొండరాయిలో కూడా గోవిందరాలు, నాగులమ్మ జాతరను పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండగ నిర్వహించారు. ఏటా కొండాయి, దొడ్ల గ్రామాల్లో జాతర నిర్వహిస్తుండగా..సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజుల గుళ్లను అందులోని పూజా సామాగ్రి ఆడేరాలు, పడిగలు, బూరలు ఇతర సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించారు. ఆలయ ఆవరణను ముగ్గులతో ప్రవేశమార్గాల్లో మామిడి తోరణాలు కట్టి అలంకరించారు.
ఇక ఈ మినీ మేడారం జాతరకు ప్రభుత్వం రూ. 32కోట్లతో ఏర్పాట్లను చేస్తోంది. ఈనెల 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు 20లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు శాఖల ఆధ్వర్యంలో రూ. 32కోట్లతో పనులను చేపట్టింది.
1.80కోట్లతో మేడారం, కన్నెపల్లిలో శ్రీ సమ్మక్క, సారలమ్మల ఆలయాలను నిర్మించారు. రూ. 1.50కోట్లతో పూజాల, గెస్ట్ హౌజ్, రూ. 2.20కోట్లతో రోడ్ల పనులను చేపట్టారు. మేడారం, కన్నెపల్లి, కాల్వపల్లి, ఊరట్టం గ్రామాల్లో రోడ్ల డెవలప్ మెంట్ పనులు మొదలు పెట్టారు. మేడారం గద్దెల దగ్గరకు వచ్చే క్యూలైన్లపై పర్మినెంట్ గా చలువ పందిళ్ల నిర్మాణంకోసం రూ. 3కోట్లు కేటాయించారు. ఇలా పలు పనుల కోసం ప్రభుత్వం రూ. 32కోట్లు కేటాయించింది. వాటితో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.






