రాజకీయాలకు అతీతంగా మేడారం జాతర : మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

రాజకీయాలకు అతీతంగా మేడారం జాతర నిర్వహిస్తామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా మేడారం జాతర : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాలకు అతీతంగా మేడారం జాతర నిర్వహిస్తామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారం జాతరను మరింత ఆకర్షణీయంగా, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ స్మృతి వనం ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొని దేవతలను దర్శించుకున్నారని సీతక్క గుర్తు చేశారు.

2024 ఫిబ్రవరిలో జరిగిన జాతరలో రూ. 115 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈసారి 2026లో జనవరి 28 నుంచి 31 మధ్య జరగనున్న జాతర కోసం మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 6 కోట్ల మంది భక్తులు సందర్శించే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మేడారం జాతర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రోడ్ల విస్తరణ, తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది, శానిటేషన్, బస్సు సౌకర్యాలు వంటి అంశాలపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

Next Story