ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతర.. పగిడిద్దరాజు మహా జాతర తేదీలు ఖరారు..

by Bhanu |

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం.. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర. కోటి మందికిపైగా భక్తులు తరలివచ్చే

ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతర.. పగిడిద్దరాజు మహా జాతర తేదీలు ఖరారు..
X

దిశ, కొత్తగూడ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం.. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర. కోటి మందికిపైగా భక్తులు తరలివచ్చే ఈ జాతర విశ్వవేదికగా మారి గిరిజన సంప్రదాయాలకు చిరుపేరవుతుంది. దేశ విదేశాల నుంచి ఆదివాసీ భక్తులు తల్లులను దర్శించుకునేందుకు వస్తారు. అలాంటి పవిత్ర మహోత్సవానికి ఆధ్యాత్మిక ఆరంభం మాత్రం… ఒకే ఒక్క గద్దెపై ప్రతిష్ఠతో మొదలవుతుంది. అదే పగిడిద్దరాజు గద్దె!

గంగారం మండలం పూనుగొండ్ల గ్రామానికి చెందిన పెనక వంశీయుల ఆరాధ్య దైవమైన పగిడిద్దరాజు దేవుడు, ఈ జాతరలో తొలిపూజల ఆరంభదాయకుడు. తల్లుల గద్దెపై ప్రతిష్ఠకు ముందు ఆయనే తొలి పూజలు అందుకోవాలి. లేకపోతే జాతర మొదలవదని గిరిజనుల నమ్మకం. ఆ సంప్రదాయానికి అనుగుణంగానే, 2026 మేడారం మహా జాతర తేదీలు తాజాగా ఖరారయ్యాయి. పూజారి పెనుక బుచ్చిరాములు, సురేందర్, రాజేశ్వర్, పురుషోత్తం నేతృత్వంలో పూజారుల సంఘం సమావేశమై తేదీలను అధికారికంగా ప్రకటించింది.

వాటి ప్రకారం:

  • ఫిబ్రవరి 4 (బుధవారం): ఉపవాసం, గుడిలో ప్రత్యేక పూజలు, సాయంత్రం గుట్ట నుండి దేవుడి గుడికి రాక
  • ఫిబ్రవరి 5 (గురువారం): ఉదయం వనం వచ్చుట, సాయంత్రం స్వామి వారి ఊరేగింపు, గంగా స్నానం
  • ఫిబ్రవరి 6 (శుక్రవారం): ఉదయం నుంచి సాయంత్రం వరకు మొక్కులు చెల్లించుట, వనప్రవేశం .. జాతర ముగింపు

ఈ తేదీలపై జాతర నిర్వహణాధికారులు సమీక్షించి అధికారికంగా ప్రకటించనున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు గిరిజన సంఘాలు ఇప్పటికే ఏర్పాట్లకు సిద్ధమవుతుండగా, పగిడిద్దరాజు పూజలతో ఈ గిరిజన మహా సంగమం ప్రారంభం కానుంది.



Next Story