ఊడిపడిన పెచ్చులు

by Bhanu |   (  Updated:2025-12-11 14:34:37  IST  )

నారాయణఖేడ్ పట్టణంలోని మండల పరిషత్ బాలికల పాఠశాలలో గురువారం స్కూల్లో పైయి కప్పు నుంచి ఊడిపడ్డ పెచ్చులుపడడంతో విద్యార్థులకు తృటిలో తప్పిన భారీ ప్రమాదం తప్పింది

ఊడిపడిన పెచ్చులు
X

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని మండల పరిషత్ బాలికల పాఠశాలలో గురువారం స్కూల్లో పైయి కప్పు నుంచి ఊడిపడ్డ పెచ్చులుపడడంతో విద్యార్థులకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల మీద ఒక్కసారిగా పెచ్చులు పడడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే బయటికి వెళ్లారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. పాత బిల్డింగ్‌కి మరమ్మతులు చేసిన కొన్ని రోజులకే పెచ్చులు ఊడడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా జరిగినప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా పట్టించుకోలేదని వాపోయారు. నాణ్యత లోపం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.

Next Story