యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి : క‌లెక్ట‌ర్ ప్ర‌తిమా సింగ్

by Ratna Kumari |

మత్తు పదార్థాలకు యువతను దూరంగా ఉంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్ సునీతా దేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డా. శివదయాలతో కలిసి మత్తు పదార్థాల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు.

యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి :  క‌లెక్ట‌ర్ ప్ర‌తిమా సింగ్
X

దిశ‌, మెద‌క్ ప్ర‌తినిధి : మత్తు పదార్థాలకు యువతను దూరంగా ఉంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్ సునీతా దేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డా. శివదయాలతో కలిసి మత్తు పదార్థాల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. మత్తుపదార్థాల‌ చికిత్స కేంద్రం పని విధానాన్ని, ల్యాబ్ లను, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్స విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని, చెడు వ్యసనాలు అలవాటు పడిన వారిని తక్షణమే చికిత్స అందించి, సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలని వైద్యులకు పిలుపునిచ్చారు.


మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు చీకటి మార్గం వైపు పయనిస్తాయని, అలాంటి చెడు దారిని ఎన్నుకోకుండా యువత సన్మార్గం వైపు ప్రయాణించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నియంత్రణపై వైద్య విద్యార్థులకు నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రం, షీల్డ్ ను బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేష్, వైద్యాధికారులు , వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు

Next Story