- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్'
తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని అందుకు కాంగ్రెస్ పార్టీకి యువత రుణపడి ఉండాలని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.

దిశ, చేర్యాల : తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని అందుకు కాంగ్రెస్ పార్టీకి యువత రుణపడి ఉండాలని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రంగు శివ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామ యువకులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. వారికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందన్నారు. దేశంలో నేడు నియంత పాలన సాగుతుందని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు, రైతు డిక్లరేషన్, యువత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పథకాలకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.






