పనులు నత్తనడకన.. ప్రయాణం నరక యాతన..!

by Thanuru Gopichand |

జాతీయ రహదారి నిర్మాణంతో ప్రయాణికుల అవస్థలు.

పనులు నత్తనడకన.. ప్రయాణం నరక యాతన..!
X

దిశ, నారాయణఖేడ్: మారుముల ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. పెరుగుతున్న వాహనాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం మార్చి 2024లో రూ.512.98 కోట్లు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి సర్వే, భూసేకరణ తదితర పనులకు మూడు నాలుగేళ్లు పట్టింది. నిజాంపేట నుంచి బీదర్ కు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రహదారి చాలాచోట్ల మూలమలుపులు ఉండడంతో దూరం పెరిగింది. అయితే ఈ రహదారి మూలమలుపులను తగ్గిస్తూ.. రెండు లైన్లు హైవే నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం దూరం 45కిలోమీటర్ల దూరం అవుతుంది. నారాయణఖేడ్ నుంచి 40కిలోమీటర్ల రహదారి మూలములను తగ్గించడం వల్ల నారాయణఖేడ్ నుంచి కేవలం 30కిలోమీటర్ల దూరం ఉంది.

నిజాంపేట నుంచి 15కి.మీ. నారాయణఖేడ్ అవుతుంది. అప్పటినుంచి నేటి వరకూ ఆ రోడ్డు విస్తరణ పనులు ఇష్టారాజంగా సాగుతున్నాయి. మొదట్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేసి, పెద్ద బావిలాంటి గోతి తీసి తవ్వి నెలల తరబడి వాటిని అలాగే వదిలివేయడంలో వాహనదారులు నాన్న ఇబ్బందులు పడ్డారు. నిజాంపేట- బీదర్ జాతీయ రహదారి విస్తీర్ణం పనులు, జాతీయ రహదారిపై చేపడుతున్న నిర్వహణ పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిర్మాణం పేరుతో సిబ్బంది అవలంబిస్తున్న తీరులో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ రహదారి పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని ఉన్నప్పటికీ ఇప్పటివరకూ‌ సగం కూడా పూర్తికాలేదు. ఎక్కడబడితే అక్కడ నెలల పాటు పెద్ద బావిలాంటి గుంతలు తవ్వి వదిలేయడంతో గత నెలలో ముగ్గురు యువకులు మృతి చెందారు.

రూ.512.98 కోట్లతో నిర్మాణం..

తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాలకు అనుసంధానంగా చేస్తూ.. జిల్లా మీదుగా సాగే సంగారెడ్డి నాందేడ్, అకోలా161 జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నారాయణఖేడ్ సమీపంలోని మండల కేంద్రమైన నిజాంపేట నుంచి బీదర్ వరకు 161- బి జాతీయ రోడ్డును గుర్తించింది. నిజాంపేట-బీదర్ పట్టణ వరకు ఏక వరుసగా మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మార్గాన్ని విస్తీర్ణాన్ని అప్పుడే ప్రతిపాదించింది. కర్ణాటక సరిహద్దు వరకు దాదాపు ౪౫ కిలోమీటర్లు మేరకు రహదారి విస్తరణకు రూ.512.98 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు 2013 మార్చి 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా శంకుస్థాపన చేశారు. మార్చి2024 సంవత్సరంలో పనుల్లో కదలిక వచ్చింది. నారాయణఖేడ్, మనూరు, ఇబ్రహీం పూర్, వద్ద మళ్లింపు దారులను నిర్మించాలని నిర్దేశించారు. నారాయణఖేడ్ పట్టణం మంగల్ పేటలోని విద్యుత్ ఉపకేంద్రం సమీపం నుంచి కీడు పట్టణం పక్కనున్న బాణాపూర్ సమీపం వరకూ వంతెన నిర్మించాలని ఉంది. 2026 మార్చి వరకు పనులు పూర్తి చేయాలని ఉంది.

గుంతలో పడి ముగ్గురు యువకుల మృతి..

జాతీయ రహదారి నిర్మాణం పనులు కొనసాగుతుండగా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయా ముందుగానే సూచిక బోర్డులు పెట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ జాతీయ రహదారులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో అమాయకులైన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల రూ.75 లక్షలు ఆర్థికసాయం ఇవ్వాలని కోరితే కాంట్రాక్టర్ భయభ్రాంతులకు గురిచేసి ఒకొక్కరికీ రూ.3లక్షలు చొప్పున ఇచ్చారు. ప్రమాదానికి కారణం రోడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పెద్ద బావి లాంటి గొంతు తీసి వదిలేసిన కారణంగా ముగ్గురు అమాయక యువకులు మృత్యువాత పడ్డారని, కాంట్రాక్టర్, అధికారులపై సుమోటో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Next Story