- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల పట్ల చిన్న చూపు ఎందుకు..? : మాజీ మంత్రి హరీశ్ రావు
రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఎందుకు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఎందుకు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు. పొద్దు తిరుగుడు, మొక్క జొన్న ధాన్యం నాలుగు రోజులుగా కొనుగోలు చేయడం లేదని రైతులు చెప్పడంతో వెంటనే అధికారులను ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ ను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారు కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదని ఎద్దెవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అని మండిపడ్డారు. నారాయణ కేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు సెంటర్ లు ప్రారంభం చేయక పోవడం దారుణమన్నారు. వెంటనే కొనుగోలు సెంటర్ లు ప్రారంభం చేసి రైతులకు మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో రైతులు తక్కువ ధరకు పండించిన ధాన్యం అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
బీసీలను సీఎం రేవంత్ రెడ్డి దగా చేసిండు
బీసీ డిక్లరేషన్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. బీసీ లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు రియాంబర్స్ మెంట్ డబ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఛేశారు. పూలే జయంతీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






