మత్స్య కారుల సంక్షేమమే ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మత్స్య కారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఏడు రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లులు, 10 కోట్ల రొయ్య పిల్లలు వదలేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు

మత్స్య కారుల సంక్షేమమే ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మత్స్య కారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఏడు రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లులు, 10 కోట్ల రొయ్య పిల్లలు వదలేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో శనివారం రూ.5.17 లక్షల విలువ గల 3 లక్షల చేప పిల్లలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్లు సాయి కుమార్ తో కలిసి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చేప పిల్లల పంపినీ పారదర్శకంగా ఉండేలా చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ లో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మత్స్య శాఖకు సీఎం రేవంత్ రెడ్డి రూ.123 కోట్లు కేటాయించారని దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో సహకరించారని తెలిపారు. గతంలో చేప పిల్లల పంపిణీ లో అవక తవకలు జరిగాయని ఈ సారి ఏ చేప దాని సైజ్ అవి ఎన్ని చేప పిల్లలు అని తెలిపేలా పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మత్స్య సంపదపై రాష్ట్రంలో 5 లక్షల మంది మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారి అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు చెప్పారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మత్స్య కారులకు కోఠి 40 లక్షలతో బీమా పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు.

గురుకులాల మెనూలో చేపలు

హుస్నాబాద్ లో పశువైద్య శాఖ ఆధునీకరణ, చేపల మార్కెట్, స్టోరేజ్ సెంటర్, పాల శీతల కరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ టూరిజంగా అభివృద్ధి చేసి మత్స్య సంపద ద్వారా ఆర్థికవృద్ధి సాధించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్య కారుల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది అన్నారు. నియోజక వర్గంలో 165 చెరువులకు గానూ 38 లక్షల 92 వేల ఉచిత చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు వివరించారు. గురుకులాల్లో మటన్ చికెన్ లాగా చేపలు కూడా మేనూ ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగ మూర్తి, హుస్నాబాద్ ఎఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కోహెడ ఎఎంసీ చైర్మన్ నిర్మలా జయరాజ్, మత్స్య సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు.

Next Story