- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలతో చారు..!
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మహామాయ జరుగుతుంది. విద్య సంవత్సరం ప్రారంభమైనప్పుడు కూడా విద్యార్థుల సంఖ్య సగానికి

దిశ, నారాయణఖేడ్: సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మంచి విద్యతో పాటు క్వాలిటీ భోజనం పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టూడెంట్స్ డైట్ చార్జీలను పెంచి కామన్ మెనూను ప్రవేశపెట్టడంతో స్టూడెంట్స్ వారి పేరెంట్స్ సంతోష పడ్డారు. కానీ, ఇందుకు భిన్నంగా పలు హాస్టల్లల్లో పురుగుల అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. తక్కువ ధర కూరగాయలను కొనుగోలు చేసి పెట్టడంతో విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. ఎహాస్టల్లో మెనూను పాటించడం లేదు. తరచుగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్, సబ్ కలెక్టర్ వివిధ హాస్టళ్లు తనిఖీ చేసి మెనూను ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నప్పటికీ కొంతమంది వార్డెన్లు తమకేమీ పట్టదు అన్నట్టుగా ఇష్టా తీరున వ్యవహరించడంతో స్టూడెంట్స్ నాణ్యతలేని భోజనం తినాల్సిన దుస్థితి ఏర్పడింది. వార్డెన్లు అందుబాటు లేక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గురుకులాల్లో వసతులు మెరుగయ్యేది ఎన్నడో...
ఖేడ్, నల్ల వాగు గురుకుల పేరెంట్స్ పేరెంట్ కమిటీ లేకపోవడం మీటింగుల్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కాకపోవడంతో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని చెప్పుకోవడానికి వేదిక లేకుండా పోయింది. ఖేడ్ గురుకుల్లో కాంట్రాక్టర్ కు డబ్బు రాలేదని విద్యార్థులకు గురుకులాల్లో నెల రోజుల నుంచి గుడ్లు, చికెన్ పెట్టడం లేదు. గోడకు విద్యుత్ బోర్డు లేకపోవడంతో విద్యార్థులు స్విచ్ ఆన్ ఆఫ్ లేక వైర్లకు పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు. కిటికీలు, తలుపులుమంచాలు లేకపోవడంతో కటిక నేలపైనే నిద్రపోవాల్సి పరిస్థితి.. కనీసం కిటికీలకు అద్దాలు లేకపోవడంతో, టాయిలెట్స్ బాత్రూమ్స్ అవసరమైన కిటికీలు లేకపోవడంతో, చలి తీవ్రతతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఉదయం చన్నీళ్లతో స్నానం చేయడం చిన్నపిల్లలకు కత్తి మీద సామల తయారయింది.
అస్తవ్యస్తంగా సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ..
సంక్షేమ వసతి గృహాలు సంక్షోభ హాస్టళ్ల గా మారాయి. ఇన్చార్జి వార్డెన్లు, అధికారుల పర్యవేక్షణ లేమి వెరాసి నిర్వహణ అధ్వానంగా మారాయి. హాస్టల్లో పరిసరాలు పరిశుభ్రత లోపించడంతో పాటు, గడ్డి, చెట్లు పెరిగిపోయి విష పురుగులు వస్తున్నాయి. వార్డెన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో పలు సందర్భాల్లో విద్యార్థులకు జ్వరం వచ్చిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉండేవి. ఉన్నంత అధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారిలో చాలామంది హాస్టల్లో ఉండి చదువుకొని ప్రయోజకులు అయిన వారి కావడం గమనార్హం. అయితే అధికారులు గానీ, ఒక్కొక్క వార్డెన్ కు రెండు చొప్పున హాస్టల్లో ఉండడంతో పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలా హాస్టల్లో కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతున్నారు. చల్లని నీటితో స్నానం చేయడంతో జలుబు దగ్గు జ్వరం వస్తుంది.
కేజీబీవీలో అంతా మాయ..
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మహామాయ జరుగుతుంది. విద్య సంవత్సరం ప్రారంభమైనప్పుడు కూడా విద్యార్థుల సంఖ్య సగానికి పైగా హాజరు ఉండదు. ఆ రోజుల్లో కూడా ఆయా విద్యార్థుల తరగతుల వారికి రిజిస్టర్లు చుక్కలు పెట్టి లెక్కలు సరి చేసుకుంటారు ఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మనూరు మండలంలోని పుల్క్ ర్తి , కంగ్టి, సిర్గాపూర్ ఇదే పరిస్థితి నెలకొంది. స్టోర్ సరుకులు మటుమాయం ఈ విద్యాలయంలో సగటున వచ్చే ప్రతి వస్తువు రికార్డు పరంగా స్టోర్ లో నిల్వ ఉండాలి. అవి ఏమీ లేవు. చల్లటి నీళ్లతో స్నానాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సిర్గాపూర్ కస్తూర్బా హాస్టల్ లో ఏఎన్ఎం లేకపోవడంతో రాత్రి వంట చేసే మనిషి ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం చేయించారు. ఇలా సందర్భంలో అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.






