- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏర్పాట్లు మంత్రికోసం.. కొబ్బరికాయ కొట్టింది ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీ రూల్ ను ఈ మాత్రం సాగనివ్వడం లేదు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీ రూల్ ను ఈ మాత్రం సాగనివ్వడం లేదు. అందుకు శనివారం జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మంత్రి వివేక్ వెంకటస్వామితో రూ.3.68కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించాలని ఏర్పా ట్లు చేస్తున్నారు. అంతలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆ పనులకు కొబ్బరికాయలు కొట్టేయడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. పటాన్ చెరు సెగ్మెంట్ లో మాత్రం తాను అనుకున్నదే చేస్తూ అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నాడు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.
కొబ్బరికాయలు కొట్టేశారు..
అమీన్ పూర్ డివిజన్ 271, బీరంగూడ డివిజన్ 270 పరిధిలో రూ.3.68కోట్ల అభివృద్ధి పనులు మంజూరు అయ్యాయి. ఆ పనులను జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో ప్రారంభించాలనుకున్నారు. కాంగ్రె స్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మంత్రితో ఈ విషయమై చర్చించారు. మంత్రి వస్తానని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం అమీన్ పూర్, బీరం గూడ డివిజన్లలో మంత్రి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన పనులకు కొబ్బరి కాయలు కొట్టారు. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. త్వరలో మంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెప్పినా ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టారని ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.
అధికార పార్టీలో అంతా గందరగోళం..
కాంగ్రెస్ పార్టీలో అంతా గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పటాన్ చెరులో మాత్రం మహిపాల్ రెడ్డి చెప్పిందే నడుస్తోందనే చర్చ కొనసాగుతున్నది. ఇటీవల అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ బదిలీ ఆర్డర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. బదిలీ ఆర్డర్ వచ్చిన ఒక్క రోజులోనే తిరిగి క్యాన్సల్ కావడం గమనార్హం. అలాగే పటాన్ చెరు పరిధిలోని సీఐ ల బదిలీల ఆర్డర్ వ్యవహారం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్డర్ లు వచ్చిన తర్వాత తిరిగి క్యాన్సల్ కావడం గమనార్హం. పటాన్ చెరులో కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీలో సరైన పవర్ లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను అనుకున్నట్లు నడిపించుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ లో కూడా "గూడెం" పవరే కొనసాగుతుందన్నారు.






