- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బండి
కోహెడ మండలం విజయ్‌నగర్ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమవడంతో బండి సంజయ్ రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు అందజేయనున్నారు.

దిశ, హుస్నాబాద్: కోహెడ మండలం విజయ్‌నగర్ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు అందజేస్తానని ప్రకటించడంతో గ్రామస్తులు ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. బీజేపీ గ్రామ శాఖ పోలింగ్ బూత్ అధ్యక్షుడు రాజశేఖర్ భార్య అమూల్య రాజశేఖర్‌ను సర్పంచ్‌గా ఎన్నుకోవాలని నిర్ణయించారు. మూడు రోజుల క్రితం అమూల్య ప్రసవించినప్పటికీ గ్రామాభివృద్ధి కోసం ముందుకు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం విశేషం.ఆమె సైతం గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ.9 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఏకైక నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. తరువాత రాజశేఖర్ గ్రామస్తులతో కలిసి కరీంనగర్‌లో బండి సంజయ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సంజయ్ వారిని శాలువాతో సన్మానిస్తూ త్వరలోనే గ్రామానికి రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన సామ రాజిరెడ్డి కూడా బండి సంజయ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు గ్రామాలను త్వరలో సందర్శించి కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని మంత్రి వెల్లడించారు.
- Tags
- medak
- Bandi Sajay






