- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు..
by Kodari Anjali |
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి.. పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ఫైల్స్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.

X
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిటిజన్ చార్టర్ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయంలో అందిస్తున్న సేవలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విజిలెన్స్ శాఖ డిజి శిఖా గోయల్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ఫైల్స్‌కు సంబంధించిన వాటిపై అధికారులు దృష్టి సారించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందజేస్తున్నారనే విషయంపై విజిలెన్స్ డీఎస్పీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు సాయంత్రం వరకు ఈ తనిఖీలు నిర్వహించనున్నారi. ప్రతి ఒక్క అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాష్ట్ర కార్యాలయానికి రిపోర్టు చేయనున్నారు.
Next Story






