- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంచర్ కమాన్ వెంటనే తొలగించాలి
దిశ, నర్సాపూర్ : ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న వెంచర్ కమాన్ వెంటనే తొలగించాలని కోరుతూ నర్సాపూర్ పట్టణానికి చెందిన రైతు మాచునూరి

X
దిశ, నర్సాపూర్ : ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న వెంచర్ కమాన్ వెంటనే తొలగించాలని కోరుతూ నర్సాపూర్ పట్టణానికి చెందిన రైతు మాచునూరి శ్రీశైలం యాదవ్ శుక్రవారం నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తనకు అసైన్డ్ భూమి సర్వేనెంబర్ 731/49 లో 12 గుంటల అసైన్ భూమి ఇచ్చిందని దాంట్లో వెంచర్ నిర్మాణం చేస్తున్న ఓ వ్యక్తి అక్రమంగా ఇసుక కంకర డస్టులను ఉంచి నిర్మాణం చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయం పై గతంలో కోర్టును ఆశ్రయిస్తే ఇంజక్షన్ ఆర్డర్ సైతం ఇచ్చారని దాన్ని ధిక్కరించి ఎదేచ్ఛగా నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. అలాగే సర్వే నెంబర్ 79 అసైన్డ్ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న కమాన్ ను తొలగించడంతోపాటు వెంచర్ మధ్యలో ఉన్న ఆ భూమిలో వేసిన ఇసుక కంకర డస్టులను వెంటనే తొలగించాలని కోరారు.
Next Story






