- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అకాల వర్షం.. అన్నదాతకు కన్నీరు!
by Taduka Kalyani |
మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతులను నిలువునా ముంచింది.

X
దిశ కొండపాక: మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతులను నిలువునా ముంచింది. పంట కోసి 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో, ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ముఖ్యంగా మర్పడగ, బందారం, దుద్దెడ, రాంపల్లి తదితర గ్రామాల్లో ధాన్యం నీటిలో కొట్టుకుపోయి మట్టిపాలైంది. అప్పులు తెచ్చి సాగు చేస్తే, ప్రభుత్వం కొనుగోలులో ఆలస్యం చేయడం వల్లే ఈ నష్టం వాటిల్లిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






