ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా సక్సెస్..

by Kodari Anjali |

సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర – మెగా జాబ్ మేళా 2026” సక్సెస్ అయింది.

ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా సక్సెస్..
X

దిశ, సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర – మెగా జాబ్ మేళా 2026” సక్సెస్ అయింది. స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో సుమారు 65 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నారు. ఐటి, ఫార్మా, టెక్నికల్, స్కిల్డ్ వర్క్, సేల్స్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండగా 2000 మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా ముఖాముఖి ఇంటర్వ్యూల అనంతరం 624 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక గా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పోలీసు శాఖ బాధ్యతలు కేవలం శాంతిభద్రతల పరిరక్షణతో మాత్రమే పరిమితం కాకుండా, సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం కూడా అన్నారు. యువతను సరైన దిశలో నడిపిస్తూ, వారి భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయడం కోసం ‘ఉద్యోగ మిత్ర’ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఎ.ఆర్) సుభాష్ చంద్రబోస్, ట్రైనీ ఐపిఎస్ ఆయేషా ఫాతిమా, ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, కంపెనీ ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story