- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు మిలాఖత్.. : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రధాని మోదీని టార్గెట్ చేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే లోకల్ బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

దిశ,మెదక్ ప్రతినిధి : ప్రధాని మోదీని టార్గెట్ చేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే లోకల్ బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ వద్ద రైతు మహా ధర్నా గురువారం జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు ఒక్కటే అనేందుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం గా పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం తోనే బరిలో నిలిచాయని, మోడీ ని బడే బాయ్ అంటూ స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిస్టానం రేవంత్ రెడ్డి పై అక్షింతలు వేయడం తో వారి మెప్పు కోసం మళ్ళీ మోడిని టార్గెట్ చేసి విమర్శలు చేసి అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ ప్రధాని పై రాష్ట్ర సీఎం ఒక వైపు ఘాటుగా విమర్శలు చేస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు అందుకు రేవంత్ రెడ్డి పై మాట్లాడటం లేదని నిలదీశారు. ఈటెల, కామ రెడ్డి ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి, మరో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మినహా బీజేపీ నేతలంతా కాంగ్రెస్ లో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు.
రాసి పెట్టుకోండి ఈ రెండు పార్టీలు ఒక్కటే అనే విషయం త్వరలో రాష్ట్రంలో అందరికీ తెలిసి వస్తుందని చెప్పారు. పదేళ్ల బీ అర్ ఎస్ పాలనలో వ్యవసాయం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు వచ్చాయన్నారు. కరెంట్ కోతలు, యూరియా కోసం చెప్పులు, రైతు బంధు కోసం నిరీక్షణ, ధాన్యం డబ్బులు మంజూరులో జాప్యం ఇలా అన్ని విషయాల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. రైతు బంధు 15 వేలు, రెండు లక్షల రుణ మాఫీ, సాగు చేసిన పంటకు బోనస్ అంటూ కాంగ్రెస్ పార్టీ చూపిన ఆశ కు రైతులు నమ్మి మోస పోయారన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలముందని, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇటీవల రైతు బంధు ఇచ్చిందని అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నమ్మి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేస్తే రైతు బంధు పూర్తిగా బంధు కావడం తో పాటు వ్యవసాయ అవసరాలు కూడా అందని దుస్థితి మళ్ళీ వస్తుందని హెచ్చరించారు.
పంట పండిస్తే బోనస్ లేదా ఇస్తామని చెప్పి హామీనిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న రకం ధాన్యం కే ఇస్తామని మెలిక పెట్టి అన్నదాతలను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు లక్షల రుణ మాఫీ పై గొప్పలు చెప్పి 42 వేల కోట్ల రైతు రుణాలు ఉంటే 20 వేల కోట్లు కూడా చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని, యూరియా విషయంలో ప్రభుత్వం ఆరు నెలల ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రం కు పంపితే సకాలంలో యూరియా వస్తుందని, తమ ప్రభుత్వంలో అదే చేసి యూరియా కొరత రాకుండా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పై ఎలాంటి ప్రేమ లేదని, వారి దందాలు ముఖ్యం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 600 రోజులు అవుతుందని, రాష్ట్రంలో రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా కూడా సాగుకు ఇవ్వలేదని విధంగా ప్రభుత్వ తీరు ఉందని, పాలకుల్లో సాగు పై ఎలాంటి అవగాహన లేకపోవడం వల్లే రైతులు అనేక కష్టాలు పడాల్సి వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెప్పాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రైతాంగం కూడా ప్రభుత్వ తీరును, కల్పిస్తున్న ఇబ్బందులను గుర్తించాలని కోరారు. నర్సాపూర్, దుబ్బాక ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, శశిధర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, హేమలత శేఖర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
మధ్యలోనే వెళ్లిపోయిన మాజీ మంత్రి హరీష్ రావు
మెదక్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహా ధర్నా కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మద్యలోనే తిరిగి వెళ్లిపోయారు. వక్తలు ప్రసంగిస్తున్న సమయంలో చివరి వరకు ఉన్న మాజీ మంత్రి మళ్ళీ వస్తా అంటూ చెప్పి వెళ్లిన హరీష్ రావు తిరిగి రాలేదు. నిరంజన్ రెడ్డి ప్రసంగం తర్వాత కలెక్టరేట్ లో రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.






