తుంకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

by Chintha Aamani |   (  Updated:2025-07-25 15:32:34  IST  )

హీరాబాద్ మండలం తుంకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి జీ. బీరప్ప ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పీ. ప్రావిణ్య ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

తుంకుంట  గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
X

దిశ,జహీరాబాద్ : జహీరాబాద్ మండలం తుంకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి జీ. బీరప్ప ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పీ. ప్రావిణ్య ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ సమావేశం లేకుండా ఓ వివాదాస్పదమైన భూమిలోని లేఔట్ కు సంబంధించి జీపీ రికార్డులను తారుమారు చేసి చేశారన్న ఆరోపణలున్నాయి. గ్రామంలోని సర్వే నెంబర్ 23/పీ, 38/పీ, 39/పీ లోని జీజీకే ప్రాజెక్టు లేఅవుట్ ప్రతిపాదనలను సరైన పత్రాలు లేకుండా జీపీఏ పత్రాల ఆధారంగా ఫార్వర్డ్ చేశారని , తప్పుడు తీర్మానం ద్వారా పంచాయతీ సమావేశం రికార్డులను తారుమారు చేసినట్లు విచారణలో తేలడంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసు సంతృప్తికరంగా లేదని భావించి కలెక్టర్ భవన నియమాలు, లేఅవుట్ నియమాలు ఉల్లంఘించి , విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అందిన విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.

Next Story