కొమురవెల్లిలో రేపే అత్యంత కీలక ఘట్టం...

by Taduka Kalyani |   (  Updated:2025-02-25 16:36:16  IST  )

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి క్షేత్రంలో పెద్ద పట్నం వేడుకలను బుధవారం రాత్రి లింగోద్భవ సమయం దాటిన తర్వాత ఓగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.

కొమురవెల్లిలో రేపే అత్యంత కీలక ఘట్టం...
X

దిశ, కొమురవెల్లి : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి క్షేత్రంలో పెద్ద పట్నం వేడుకలను బుధవారం రాత్రి లింగోద్భవ సమయం దాటిన తర్వాత ఓగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత కీలక ఘట్టమైన మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే పెద్ద పట్నం వేడుకలకు తోటబావి ప్రాంగణంను అధికారులు సిద్ధం చేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు లింగోద్భవ కాలంలో ఆలయ గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం, ఓగ్గు పూజారుల ఆధ్వర్యంలో తోటబావి వద్ద నున్న ప్రాంగణంలో పంచరంగుల చూర్ణంతో పెద్ద పట్నం వేసి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పెద్ద పట్నం నిర్వహించే తోటబావి ప్రాంగణంను అధికారులు సిద్ధం చేశారు.

పెద్ద పట్నం నిర్వహణకు పటిష్ట బందోబస్తు

కొమురవెల్లి లోని తోట బావి ప్రాంగణంలో పెద్ద పట్నం నిర్వహించనున్న నేపథ్యంలో సిద్దిపేట సీపీ అనురాధ ఆదేశాల మేరకు కొమురవెల్లి ఎస్ ఐ రాజు గౌడ్ దేవాలయ అధికారులతో కలిసి మంగళవారం తోట బావి ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, ఏ ఈ లు సతీష్, సాంబయ్య, ఆలయ ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story