- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేం గోస.. మండుటెండలో వరి ధాన్యం వద్ద పడిగాపులు
చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో గల మెదక్- చేగుంట రహదారిపై శనివారం మధ్యాహ్నం మహిళా రైతులు ఆందోళనకు దిగారు.

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో గల మెదక్- చేగుంట రహదారిపై శనివారం మధ్యాహ్నం మహిళా రైతులు ఆందోళనకు దిగారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించిన ధాన్యాన్ని 20 రోజుల నుంచి తూకం వేసిన బస్తాలు అలాగే ఉండటంతో మండుటెండలో అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా రైతులు అధికారులను నిలదీశారు. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచార అందుకున్న ఎస్సై శివానందం తన సిబ్బందితో రాస్తారోకో చేస్తున్న సంఘటన స్థలానికి వెళ్లి రైతులను సందాయించారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ మహేందర్ గౌడ్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సంఘటన స్థలానికి వెళ్లి రైతులను సముదాయించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు తెలియజేసి పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు పై రాస్తారోకో చేయడం ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.






