- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న దొంగ అరెస్ట్
సదాశివపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తిని సదాశివపేట పట్టణ పోలీసులు పట్టుకొని అతడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, సదాశివపేట : సదాశివపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తిని సదాశివపేట పట్టణ పోలీసులు పట్టుకొని అతడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సదాశివపేట పట్టణ ఇన్ స్పెక్టర్ డి.వెంకటేష్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నేరస్తుడు ఇష్రీతాబాద్ గ్రామానికి చెందిన బలరాం సంగమేశ్వర్ జల్సాలకు, మద్యానికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే నెలలో ఇష్రీతాబాద్ గ్రామంలో ఒక పల్సర్ బైక్, ఆత్మకూరు గ్రామంలో గ్లామర్ బైక్, సదాశివపేట పట్టణంలో స్ప్లెండర్ ప్లస్ బైక్ ని దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి మూడు బైకులను స్వాధీనం చేసుకొని నేరస్తుడిని రిమాండ్ కు తరలించినట్టు సదాశివపేట ఇన్ స్పెక్టర్ డి.వెంకటేష్ తెలిపారు. దొంగలను పట్టుకున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాష, మల్లేశంను ఇన్ స్పెక్టర్ అభినందించారు.






