సంగారెడ్డిలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

by Ratna Kumari |

ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రస్తుత జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ ఆశించినంత అభివృద్ధి మాత్రం జరగలేదని, గత పాలకుల ముందు చూపు లేకపోవడమే ఇందుకు కారణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

సంగారెడ్డిలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు : మెదక్ ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, సంగారెడ్డి అర్బన్: ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రస్తుత జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ ఆశించినంత అభివృద్ధి మాత్రం జరగలేదని, గత పాలకుల ముందు చూపు లేకపోవడమే ఇందుకు కారణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డిలో రూ. 30 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులకు ముందు చూపు లేకపోవడంతో, సంగారెడ్డిలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత పార్టీలు, జెండాలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని అన్నారు. తాను ఎంపిగా గెలవగానే సంగారెడ్డి, సదాశివపేట, మెదక్ పట్టణాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ చేత సిద్ధం చేయించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కేంద్రానికి పంపిస్తే తాను ఎంపీగా ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేసేందుకు తాను సహకరిస్తానని తెలిపారు. లక్షకు పైగా జనాభా కలిగిన సంగారెడ్డి పట్టణంలో పెరిగిన జనాభా అవసరాలకు, కాలుష్య నివారణకు అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటే పరిష్కారం అని అన్నారు. తాను అభివృద్ధికి సహకరిస్తానని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగరాజు ,వాసు, రాజు గౌడ్, విజయ్, శేఖర్ ద్వారక రవి పాల్గొన్నారు.

Next Story