- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళాల కోసం ఊరంతా ఎదురుచూపులు
by Chintha Aamani |
జహీరాబాద్ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాల 14వ తేదీన ఇస్తామని లబ్ధిదారులుకు తెలిపారు.

X
దిశ,జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాల 14వ తేదీన ఇస్తామని లబ్ధిదారులుకు తెలిపారు. దీంతో వారు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో ఎదురుచూసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాళాలు ఇస్తామని ప్రకటించి ,ఇవ్వకుండా పలుమార్లు వాయిదా వేశారని వాపోయారు. 14వ తేదీన ఇస్తారని నమ్మి వచ్చిన లబ్ధిదారులు ఉదయం 10 గంటల నుంచి సభాస్థలి వద్ద ఎదురుచూస్తు ఆకలితో అలమటించారు. ప్రజాప్రతినిధులు ఎవరూ రాకపోవడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు ఆందోళన చేసే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఫంక్షన్ హాల్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పట్ల లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






