గ్రామస్థులను బెదిరింపులకు గురి చేస్తున్న రేషన్ డీలర్ ను మార్చాలి

by Nallavelli.Anjaneyulu |

తన ఇష్టానుసారంగా గ్రామ ప్రజలను దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర పదజాలంతో గ్రామస్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న రేషన్ డీలర్ ను మార్చాలని గ్రామానికి చెందిన యాదస్ నరేష్ ఎమ్మార్వో కి గురువారం ఫిర్యాదు చేశాడు.

గ్రామస్థులను బెదిరింపులకు గురి చేస్తున్న రేషన్ డీలర్ ను మార్చాలి
X

దిశ, తూప్రాన్ : తన ఇష్టానుసారంగా గ్రామ ప్రజలను దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర పదజాలంతో గ్రామస్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న రేషన్ డీలర్ ను మార్చాలని గ్రామానికి చెందిన యాదస్ నరేష్ ఎమ్మార్వో కి గురువారం ఫిర్యాదు చేశాడు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్ బుధవారం రేషన్ తీసుకోవడానికి వెళ్లగా డీలర్ తీవ్ర పదజాలంతో దూషించి అవమానపరిచారు. అలాగే గ్రామంలో వాళ్ల‌ ఇష్టానుసారంగా నచ్చినట్లు రేషన్ ఇస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ విషయం పై రేషన్ డీలర్ వివరణ కోరగా.. మూడు నెలల బియ్యం ఒకేసారి వచ్చేవరకు రద్దీ పెరిగింది అని క్యూ పద్ధతితో వెళ్లాలని కోరామని తెలిపారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఏమి అనలేదు రద్దీ పెరగడంతో కొంత సమయమనం పాటించాలని కోరం అంతే అని తెలిపారు.

Next Story