- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం : హరీశ్ రావు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారన్నారు. క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ఉంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో దళారులకు రూ. 1600- 1700 లకే అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. సన్‌ఫ్లవర్‌కు క్వింటాల్‌కు రూ. 7721 మద్దతు ధర ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో జిల్లాలో యాసంగిలో సైతం రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధించారన్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారిందన్నారు. ఈ ప్రాజెక్టు మన ప్రాంత రూపురేఖలను మార్చేసి, వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశం చేసిందన్నారు. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దు, కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని హరీష్ రావు సూచించారు.






