మోచి కులస్తుల సమస్యలు పరిష్కరిస్తా : జ‌గ్గారెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి లోని మోచి కులస్తుల సమస్యలను పరిష్కరిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం రవిదాస్ మోచి సంఘం నాయకులు

మోచి కులస్తుల సమస్యలు పరిష్కరిస్తా : జ‌గ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి లోని మోచి కులస్తుల సమస్యలను పరిష్కరిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం రవిదాస్ మోచి సంఘం నాయకులు మోచి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని, కమ్యూనిటీ హాల్ కొరకు స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి సహకరించాలని కోరారు. రవిదాస్ మోచి సంఘం పట్టణ అధ్యక్షుడు కనేరి సీతారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు జగ్గారెడ్డి నివాసం వద్ద ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిటి హాల్ స్థలం ఇవ్వడానికి సుముఖత వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం లో సంగారెడ్డి జిల్లా నాయకులు, సంగారెడ్డి టౌన్ నాయకులు రమేష్ , దేవరాజ్, ఉమా శంకర్ ,పులి సుభాష్ ,రాజు, బాలరాజ్ ,శీను, చిన్న మనోహర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Next Story