- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని, కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు.

దిశ, నర్సాపూర్: నీట్ పేపర్ లీకేజీల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలంటే ప్రధానమంత్రి మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏఐసీసీ,టీపీసీసీ ఆదేశాల మేరకు పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రారంభించిన “ఛాత్రోన్ కి గూంజ్” ఉద్యమానికి మద్దతుగా డీసీసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, తరచూ జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక ప్రక్రియల్లో జాప్యాలు లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని, అలాగే 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.
ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వానికి...
లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, పేపర్ లీకేజీల కారణంగా వారి శ్రమ వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన విధానాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించాలని పిలుపునిచ్చారు. యువత గొంతుతో దేశ భవిష్యత్తు – ఛాత్రోన్ కి గూంజ్ విజయవంతం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, మెదక్ జిల్లా కార్యదర్శి రవీందర్ యాదవ్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మాత్,నర్సాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్, సర్పంచులు పద్మావతి అశోక్ గౌడ్, ఉదయ్ కుమార్, నాయకులు పాషా, సుధీర్ కుమార్ గౌడ్,నరేష్, సురేష్ గౌడ్, మోహన్ దాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొనారు.






