- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోలేదు
గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ఉద్యమంలో అండగా నిలిచిన వారిని గుర్తించలేదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ఉద్యమంలో అండగా నిలిచిన వారిని గుర్తించలేదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గురువారం తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కొరకు అందరూ ఐక్యంగా పోరాడామని, ఉద్యమ సమయంలో మనకు అండగా నిలిచిన ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఐక్య ప్రజా ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ జన సమితి కీలక పాత్ర పోషించిందని అన్నారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, నిరుద్యోగం, బీసీ రిజర్వేషన్ల పెంపు, అందరికీ విద్యా, వైద్యం ,ఆదివాసిల భూ సమస్యలు, విభజన హామీలు అమలు, రైతులు, చేతివృత్తుల వారికి ఆదాయ భద్రత, స్థానికులకు ప్రైవేట్ రంగంలో అవకాశం వంటి అనేక సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించింది అని అన్నారు. ప్రజల కేంద్రంగా రాజకీయాలు జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. స్వలాభం, స్వార్థం తో డబ్బు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని అన్నారు. గెలుపోటములు సహజమని నమ్ముకున్న ప్రజల సమస్యలపై పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం జన గణన చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేంద్రం 9 షెడ్యూల్లో చేర్చకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. విద్య ,వైద్యం అందరికీ అందాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచడం జరిగిందని, త్రిబుల్ ఆర్, నిమ్స్ లాంటి ప్రాజెక్టులలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. సారవంతమైన భూములకు సంగారెడ్డి జిల్లా పేరు గాంచిందని కానీ గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఆగం చేసిందని అన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాజకీయ పార్టీగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలపై పోరాడ గలుగుతామని, ప్రజల పక్షాన్ని తెలంగాణ జన సమితి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి నాయకులు తుల్జా రెడ్డి , ఆశప్ప, సాయిలు ,లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు.






