ఉచిత విద్య వైద్యం అందించేలా దేశ రాజకీయ వ్యవస్థ మారాలి

by Ratna Kumari |

ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన విద్య వైద్యం అందించేలా దేశ రాజకీయ వ్యవస్థ మార్పు అవసరమని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు.

ఉచిత విద్య వైద్యం అందించేలా దేశ రాజకీయ వ్యవస్థ మారాలి
X

దిశ, కొండపాక : ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన విద్య వైద్యం అందించేలా దేశ రాజకీయ వ్యవస్థ మార్పు అవసరమని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. కొండపాక సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ పొందిన చిన్నారులకు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం ఆసుపత్రిలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులలతో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసినా సమావేశంలో రఘనందన్ రావు మాట్లాడుతూ పనికిరాని ఉచితాలు అందిస్తూ ఎన్నికలు రాగానే ఓటు కోసం డబ్బులు పంచె సంస్కృతి మారాలని పేర్కొన్నాడు. ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందితే ఏది అవసరం ఉండదని ఆ దిశగా ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలు మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నాడు. మానవసేవే మాధవసేవ లాగా భావించి ప్రతి ఒక్కరు మంచి చేయాలని ఆలోచన సేవా దృక్పథం పెంపొందించుకోవాలన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యం ఉండాలని పేర్కొన్నాడు. కొండపాకలో ఏర్పడిన సంజీవని ఆసుపత్రిలో గుండెకు చిత్రం పడిన ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్లు చేస్తూ వారిలో వెలుగులు నింపుతున్న సత్యసాయి సంజీవని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. వారి సేవలను కొనియాడారు. సత్యసాయి సంస్థ వారు ఒక విజన్ తో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సంవత్సర కాలంలో పూర్తిచేసి ప్రజలకు సేవలు అందించేలా పనిచేస్తారని కొనియాడారు. సత్యసాయి బాలికల పాఠశాలలో ఎంతో మంది అనాధలు పేదవారు ఉచితంగా విద్యనిభ్యసిస్తూ మళ్ళీ అదే పాఠశాలలో ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా సంస్థలను సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. అవసరమైన వారికి ఆపన్న హస్తం అందించేలా నిలబడే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసినా చేసినా జాతీయ జెండా ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ , బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ,బిజేపి నాయకులు మంచాల శ్రీనివాస్ గౌడ్ నీల సత్యం, అనుముల సంపత్ రెడ్డి, తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Next Story