మొక్కజొన్న రైతుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి

by Bhanu |

హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటలకు ఇంకా బకాయిలు చెల్లించకపోవడంపై నియోజకవర్గ ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు

మొక్కజొన్న రైతుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటలకు ఇంకా బకాయిలు చెల్లించకపోవడంపై నియోజకవర్గ ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నెలన్నర క్రితం పంట అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని, పెట్టుబడుల కోసం తెచ్చుకున్న అప్పులు ఎలా తీర్చుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వ కేంద్రాల్లో పంట విక్రయించడంలో అధికారులు పెడుతున్న కోతలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా మొక్కజొన్న రైతుల పెండింగ్ చెల్లింపులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎమ్.ఏ. అన్వర్ పాషా, పార్టీ సీనియర్ నాయకులు కన్నోజు రామకృష్ణ, బొజ్జ హరీష్, భూక్యా లక్ష్మనాయక్, డికొండ ప్రవీణ్, భూక్యా రాజు నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story