రైస్ మిల్లుల్లో ధాన్యం ఆన్ లోడింగ్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాలి

by Ratna Kumari |

కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి వేగవంతం జరపాలని మెదక్ ఆర్డిఓ రమాదేవి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు.

రైస్ మిల్లుల్లో ధాన్యం ఆన్ లోడింగ్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాలి
X

దిశ, చిన్నశంకరంపేట : కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి వేగవంతం జరపాలని మెదక్ ఆర్డిఓ రమాదేవి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఉన్న వాయుపుత్ర రైస్ మిల్ ను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డివో రమాదేవి మాట్లాడుతూ హమాలీల కొరత లేకుండా లారీలు త్వరగా ఖాళీ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రైస్ మిల్ యజమాన్యానికి తెలిపారు.

మ య‌మండలంలోని గవ్వలపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ, హమాలి, వడ్లతూకం మరియు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరి ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు, గోదాములకు ‌తరలించడం జరుగుతుందని తెలిపారు.

Next Story