- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజ గజ.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ అంచనాల ప్రకారం డిసెంబర్ 7 నుండి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా శక్తివంతమైన కోల్డ్‌వేవ్ ప్రభావం ఉండనుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దిశ, హుస్నాబాద్: తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ అంచనాల ప్రకారం డిసెంబర్ 7 నుండి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా శక్తివంతమైన కోల్డ్‌వేవ్ ప్రభావం ఉండనుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా పింక్ మార్క్ ఉన్న జిల్లాలో ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 6–9°C వరకు పడిపోవచ్చని, బ్లూ కలర్ మార్క్ ఉన్న జిల్లాలో ఉష్ణోగ్రతలు 9°C–12°C వరకు పడిపోవచ్చని, డిసెంబర్ 10–13 మధ్య తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. సిద్దిపేట జిల్లా పింక్ జోన్‌లో ఉండడంవల్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి, జిల్లాలో రాత్రి–ఉదయం వేళల్లో తీవ్ర చలి, పొగమంచు ఉండనుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పగలు ఆకాశం స్వచ్ఛంగా, ఎండ కనిపించినప్పటికీ రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఎక్స్‌లో హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలున్న వారు వెచ్చని దుస్తులు ధరించాలని, అవసరం లేకుండా రాత్రి బయటకు వెళ్లరాదని వైద్యులు తెలిపారు.






