- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక రోల్ మోడల్
by Taduka Kalyani |
చుట్టూ కొండల నడుమ పచ్చని చెట్ల మధ్య నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు.

X
దిశ, కోహెడ : చుట్టూ కొండల నడుమ పచ్చని చెట్ల మధ్య నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం కోహెడ మండలం లో తంగళ్లపల్లి గ్రామ శివారులో దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ ప్రాంతం మొత్తం కలియతిరిగారు. రాష్ట్రంలోనే నిర్మాణ పురోగతిలో అగ్రస్థానంలో ఉందని 23 ఎకరాల్లో అతిపెద్ద విద్యాసంస్థ నిర్మాణం కావున మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఈడబ్ల్యూఐడి సి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు తరుచు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
Next Story






