- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాల తాళాలు పగులగొట్టిన ఆకతాయిలు
వేసవి సెలవులను అదునుగా తీసుకొని గుర్తు తెలియని ఆకతాయిలు ప్రభుత్వ పాఠశాలలో బీభత్సం సృష్టించారు.

దిశ, రాయికోడ్ : వేసవి సెలవులను అదునుగా తీసుకొని గుర్తు తెలియని ఆకతాయిలు ప్రభుత్వ పాఠశాలలో బీభత్సం సృష్టించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్ర పరిధిలోని పాంపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల ఆఫీసు రూమ్ తో పాటు, 10 వ తరగతి గది తాళాన్ని పగులగొట్టారు. తరగతి గదిలో ఉన్న కరెంట్ బోర్డు , 3 ఫ్యాన్లను, బీరువాను ధ్వంసం చేశారు. అలాగే పాఠ్య పుస్తకాలను చిందరబంధర చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీత, మండల విద్యాధికారి జీ నర్సింహులు కు సమాచారం అందించారు. మంగళవారం మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు విజయ్, బీ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, యువకులున్నారు.






