తొలివిడత 88.03 శాతం పోలింగ్

by Bhanu |   (  Updated:2025-12-11 15:04:39  IST  )

సిద్దిపేటలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

తొలివిడత 88.03 శాతం పోలింగ్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాలలోని 149 గ్రామ పంచాయతీలకు, 1208 వార్డుల పరిధిలో పురుషులు 90,629, మహిళలు 93,929 , ఇతరులు 2 ఓటర్లు మొత్తం 1,83,955 మంది ఓటర్లకు 1,61,971 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 88.05 శాతం పోలింగ్ నమోదైంది. దౌల్తాబాద్ మండల పరిధిలో పురుష ఓటర్లు 11,435, మహిళా ఓటర్లు 11,979 మంది మొత్తం 23,414 మంది ఓటర్లకు 20,789 మంది ఓటు హక్కు వినియోగించు కోగా 88.79 శాతం పోలింగ్ నమోదైంది. గజ్వేల్ మండల పరిధిలో పురుష ఓటర్లు 16,304, మహిళా ఓటర్లు 17,229 మంది ఇతరులు 2 మొత్తం 33,535 మంది ఓటర్లకు 29,522 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 88.03 శాతం పోలింగ్ నమోదైంది.

జగదేవపూర్ మండల పరిధిలో పురుష ఓటర్లు 14,273, మహిళా ఓటర్లు 14,875 మంది మొత్తం 29,148 ఓటర్లకు 24, 564 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 84.27 శాతం పోలింగ్ నమోదైంది. మర్కుక్ మండల పరిధిలో పురుష ఓటర్లు 8725, మహిళా ఓటర్లు 9008 మంది మొత్తం 17733 మంది ఓటర్లకు 15,887 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 89.59 శాతం పోలింగ్ నమోదైంది. ములుగు మండల పరిధిలో పురుష ఓటర్లు 15373, మహిళా ఓటర్లు 15551 మంది మొత్తం 30, 924 మంది ఓటర్లకు 27,356 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 88.46 శాతం పోలింగ్ నమోదైంది.

రాయపోల్ మండల పరిధిలో పురుష ఓటర్లు 10061, మహిళా ఓటర్లు 10504 మంది మొత్తం 20565 మంది ఓటర్లకు 17,896 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 89.66 శాతం పోలింగ్ నమోదైంది. వర్గల్ మండల పరిధిలో పురుష ఓటర్లు 14,458, మహిళా ఓటర్లు 14,783 మంది మొత్తం 29,241 ఓటర్లకు 25,957 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 88.77 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1432 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ సాగింది. జిల్లా కలెక్టర్ కే హైమావతి పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.

Next Story