తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచే సంస్కృతి మంచిది కాదు : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచే సంస్కృతి మంచిది కాదు : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచే సంస్కృతి మంచిది కాదని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట బీఏఆర్ గార్డెన్ లో నియోజకవర్గ అభివృద్ధిపై విద్యార్థులు రుపొందించిన వీడియోను మంత్రి హరీష్ రావు అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు పాశ్చాత్య దేశాల మోజులో పడొద్దని, భారతీయ సంస్కృతి అత్యంత గొప్పదన్నారు. తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమ మాత్రమే అశిస్తారని, పిల్లలు గొప్ప వారిగా ఎదిగినప్పుడు సంతోషిస్తారని అన్నారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని మంత్రి అన్నారు. అమ్మ, నాన్నలు బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టారని వ్యక్తిత్వ వికాస నిపుణులు రంజిత్ ను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల. సాయిరాం, ప్రతిభ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వ్యక్తిత్వ వికాసం, మోటివేషన్ క్లాస్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Next Story

Most Viewed